బాలచందర్ గారు నన్ను పిలిపించి ముఖం మీదే చెప్పేశారు: నటి సుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలచందర్ గారు నన్ను పిలిపించి ముఖం మీదే చెప్పేశారు: నటి సుధ

  • హీరోయిన్ గా మూడు సినిమాలు చేశాను
  • ఓ రోజున బాలచందర్ గారు పిలిపించారు 
  • హీరోయిన్ గా నిలబడటం కష్టమన్నారు
తెలుగు తెరపై అటు యంగ్ హీరోలకి .. ఇటు హీరోయిన్స్ కి తల్లిగా నటిస్తూ సుధ మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక అనుభవం గురించి ప్రస్తావించారు. "తమిళంలో హీరోయిన్ గా మూడు సినిమాలు చేశాను. విలన్ గా పేరు తెచ్చుకున్న రఘువరన్ .. హీరోగా చేసిన సినిమా కూడా ఆ జాబితాలో వుంది.

కొంతకాలం గడిచిన తరువాత బాలచందర్ గారు నన్ను పిలిపించారు. బాలచందర్ గారు ఏ విషయమైనా ముఖం మీదే చెప్పేస్తారు. అలాగే ఆయన "చూడమ్మా నీ ముఖం హీరోయిన్ గా పనికి రాదు .. హీరోయిన్ గానే చేస్తానంటే నువ్వు ఇండస్ట్రీలో ఉండలేవు. నువ్వు కేరక్టర్ ఆర్టిస్ట్ అవుతానంటే .. హీరోయిన్ కి ఈక్వెల్ గా ఒక సిస్టర్ కేరక్టర్ వుంది .. ఇస్తాను. కేరక్టర్ ఆర్టిస్టుగానైతే నీకు ఇష్టం వచ్చినంత కాలం ఇండస్ట్రీలో ఉండొచ్చు. నీకు ఒక వారం రోజులు సమయం ఇస్తున్నాను .. ఆలోచించుకుని చెప్పు" అన్నారు. అలా ఆయన అనడం వల్లనే ఈ రోజున ఈ స్థానంలో వున్నాను. అని చెప్పుకొచ్చారు.  
sudha

More Telugu News