ఆ సినిమా తరువాత ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు: నటుడు జయప్రకాశ్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమా తరువాత ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు: నటుడు జయప్రకాశ్ రెడ్డి

  • సినిమాలు మానేసి వెళ్లిపోయాను
  • అనుకోకుండా రామానాయుడుగారి కళ్లలో పడ్డాను 
  • అలా 'ప్రేమించుకుందాం రా'లో ఛాన్స్ వచ్చింది         
కొంతకాలం పాటు సినిమాలు చేసి .. కొంతమంది డబ్బులు ఎగ్గొట్టడం వలన జయప్రకాశ్ రెడ్డి అప్పులపాలయ్యారు. ఇక ఇండస్ట్రీలో వుంటే అప్పులు ఇంకా పెరిగిపోతాయనే భయంతో ఆయన సొంతవూరుకి వెళ్లిపోయారు. అలా కాలక్రమంలో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తరువాత ఏం జరిగిందనే విషయాన్ని తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

"ఒక రోజున నేను నా స్నేహితుడికి తోడుగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి వెళ్లాను. అనుకోకుండా అక్కడ రామానాయుడు గారు కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఒక సినిమా చేస్తున్నట్టుగా చెప్పి .. వెంటనే వెళ్లి సురేశ్ బాబును కలవమన్నారు. వెళ్లి కలిస్తే .. ఖద్దరు పంచె కట్టి .. మీసాలు పెట్టి ఫోటో షూట్ చేయించారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన మూడో రోజున దర్శకుడు జయంత్ సి. పరాన్జీ కాల్ చేశారు. హీరోయిన్ ఫాదర్ గా మెయిన్ విలన్ గా నేను సెలెక్ట్ అయినట్టుగా చెప్పారు. ఆ సినిమాయే 'ప్రేమించుకుందాం రా' .. సూపర్ హిట్. ఇక అప్పటి నుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.       
jayaprakash reddy

More Telugu News