dhoni: నంబర్ 7 సెంటిమెంట్ మాకు కలిసొచ్చింది: ధోనీ

షార్ట్స్‌లో చూడండి
ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల నిషేధం ఎదుర్కొని... ఈ ఐపీఎల్ లో మళ్లీ పున:ప్రవేశం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా విజేతగా అవతరించింది. జట్టు మొత్తం వయసు పైబడిన ఆటగాళ్లతో నిండిపోయిందంటూ తొలుత విమర్శలు ఎదుర్కొన్న జట్టు... వయసు కంటే అనుభవమే ముఖ్యమని చాటి చెప్పింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్ల మాయాజాలంతో ట్రోఫీని కైవసం చేసుకుంది. నిన్న సన్ రైజర్స్ హైదరాబాదుతో జరిగిన ఫైనల్లో వెటరన్ ప్లేయర్ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 117) విరుచుకుపడటంతో... చెన్నై జట్టు మూడోసారి ట్రోఫీని అందుకుంది.

ఈ సందర్భంగా చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ నంబర్ 7 తమకు కలిసొచ్చిందని చెప్పాడు. ఫైనల్స్ జరిగిన తేదీ 27, సాధించాల్సిన స్కోరు 179, నా జెర్సీ నంబర్ 7, చైన్నై ఫైనల్స్ కు రావడం 7వ సారి, షేన్ వాట్సన్ చేసిన స్కోరు 117... ఇలా అన్ని చోట్లా 7 కలిసొచ్చిందని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. సెంటిమెంటును పక్కనపెడితే, టీమ్ పర్ఫామెన్స్ చాలా బాగుందని అన్నాడు. 
Go Back to Shorts
dhoni
ipl
7

More Telugu News