పెట్రోల్ ధరలను రూ. 25 వరకు తగ్గించవచ్చు: చిదంబరం
- ధరలను తగ్గించే అవకాశం ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదు
- ఖజానాను నింపుకునేందుకు సామాన్యులపై భారం మోపుతోంది
- కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ చిదంబరం
ముడిచమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలను లీటరుకు రూ. 15 వరకు తగ్గించవచ్చని... ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను రూపంలో వసూలు చేస్తున్న మొత్తాన్ని తగ్గించడం ద్వారా మరో రూ. 10 తగ్గించవచ్చని చెప్పారు. మొత్తంమీద రూ. 25 వరకు తగ్గించవచ్చని తెలిపారు. పెట్రో ధరలను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ... కేంద్రం మాత్రం ఆదాయం గురించే ఆలోచిస్తోందని విమర్శించారు.