'అన్నా .. మాది రాయల సీమ' అంటోన్న ఎన్టీఆర్

  • ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ'
  • ఆయన సరసన పూజా హెగ్డే .. ఈషా రెబ్బా 
  • యాక్షన్ ఎపిసోడ్ కి సన్నాహాలు  
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో.. మరో కథానాయికగా ఈషా రెబ్బా కనిపించనుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడతాడట. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. " అన్నా .. మాది రాయల సీమ .. నమ్మితే ప్రాణాలు ఇస్తాం .. నమ్మక ద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం" అంటూ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. తదుపరి షెడ్యూల్ లో చేయనున్న యాక్షన్ ఎపిసోడ్ ను, రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్నట్టుగా సమాచారం.  
Go Back to Shorts
ntr
pooja hegde
eesha rebba

More Telugu News