చిరంజీవి కోసం జానపద కథ .. దర్శకుడిగా నాగ్ అశ్విన్!
- 'మహానటి'తో మార్కులు కొట్టేసిన నాగ్ అశ్విన్
- చిరంజీవి నుంచి అభినందనలు
- ఆయనతో సినిమా చేసే ఛాన్స్
చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పగా .. ఈ సినిమా వైజయంతీ బ్యానర్లో వుంటుందనే విషయాన్ని అశ్వనీదత్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో నాగ్ అశ్విన్ చేయనున్నది జానపద కథ అని తెలుస్తోంది. ఈ సినిమాకి 'భైరవ' అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? ఎవరెవరు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నారు? వంటి విషయాల్లో త్వరలోనే స్పష్టత రానుంది.