'మహానటి' నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుంది!: ‘లోక్ సత్తా’ జేపీ
- మహానటి’ సినిమా చూశా .. ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు
- ఈ చిత్రం గొప్పనటికి జీవం పోసింది
- కన్నీరు ఆపుకోవడం కష్టం!
‘‘మహానటి’ సినిమా చూశాను. అసామాన్య నటి సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ బయోపిక్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, తెర వెనుక పని చేసిన బృందం, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఎంతో గొప్పగా పని చేశారు. ఈ చిత్రం గొప్పనటికి జీవం పోసింది .. కన్నీరు ఆపుకోవడం కష్టం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన కీర్తి సురేశ్, సమంతాలు అద్భుత నటన ప్రదర్శించారు.. నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా ఎంతో కదలించి వేసింది .. భావోద్వేగం చెందేలా చేసింది. నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుంది’ అని జేపీ ప్రశంసలు కురిపించారు.