'ఎవడే సుబ్రమణ్యం'కు సీక్వెల్ ప్రయత్నాలు
- నాని హీరోగా వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం'
- ఈ సినిమాతో ఆయనకి హిట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
- ఇద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేసే ఛాన్స్
'ఎవడే సుబ్రమణ్యం' సినిమా ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచి కొత్త కథను అల్లుకుని సీక్వెల్ చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. నాని హీరోగానే ఆయన ఈ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టే పనిలో వున్నాడని అంటున్నారు. తాను ఇబ్బందుల్లో వున్నప్పుడు నాగ్ అశ్విన్ మంచి హిట్ ఇచ్చినందువలన, ఈ సినిమా చేయడానికి నాని తప్పకుండా ఒప్పుకుంటాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్పష్టమైన సమాచారం త్వరలోనే రావొచ్చు.