కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఈరోజు సాయంత్రంతో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఈ నెల 12న 223 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు
- 15న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
కాగా, ఈ నెల 12న కర్ణాటకలోని 223 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఇదిలా ఉండగా, కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలుండగా, బీజేపీ అభ్యర్థి విజయకుమార్ ఆకస్మిక మరణంతో జయనగర నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడింది.