కోల్ కతా నైట్ రైడర్స్ దారుణ ఓటమితో... షారూక్ ఖాన్ క్షమాపణలు
- ఆటలో స్ఫూర్తి లోపించింది
- కేకేఆర్ బాస్ గా క్షమాపణలు చెప్పాలి
- ట్విట్టర్లో షారూక్ పోస్ట్
ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో నైట్ రైడర్స్ 102 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో షారూక్ ఖాన్ ఓ పోస్ట్ పెట్టారు. ‘‘క్రీడలన్నవి స్ఫూర్తితో కూడి ఉంటాయి. కానీ, ఆ స్ఫూర్తి లోపించడంపై అభిమానులకు కేకేఆర్ బాస్ గా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని షారూక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కేకేఆర్ తాజా ఓటమితో ఐదో స్థానానికి దిగిపోగా, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానానికి చేరుకుంది.