నేను అభిమానించే హీరోయిన్ తనే!: ఆకాశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను అభిమానించే హీరోయిన్ తనే!: ఆకాశ్

  • అమ్మ ఎంతో క్రమశిక్షణతో పెంచింది 
  • ఎదుటివారిని ఎలా గౌరవించాలో నేర్పింది 
  • నాలోని మంచి లక్షణాలకు అమ్మనే కారణం  
ఆకాశ్ పూరీ చిన్నప్పటి నుంచి తన తండ్రి డైరెక్ట్ చేసిన సినిమాలను చూస్తూ పెరిగాడు. తొలిసారిగా తన తండ్రి దర్శకత్వంలో 'మెహబూబా' అనే ప్రేమకథా చిత్రాన్ని చేశాడు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆకాశ్ మాట్లాడాడు.

 "ఇప్పుడున్న కథానాయికలలో ఎవరిని ఎక్కువగా అభిమానిస్తుంటారు?"అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన స్పందిస్తూ, ''నేను అనుష్కను ఎక్కువగా అభిమానిస్తాను" అని చెప్పాడు. ఇక మరో ప్రశ్నకి సమాధానంగా ఆయన "మా అమ్మ నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచింది. ఎవరితో ఎలా మాట్లాడాలి .. ఎలా గౌరవించాలి? అనే విషయాలను అమ్మ చెప్పేది. నాలో మంచి లక్షణాలు ఏవైనా వున్నాయంటే .. అందుకు కారకురాలు మా అమ్మనే' అంటూ తన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.  
akash
anushka

More Telugu News