నాని చేతుల మీదుగా 'జంబ లకిడి పంబ' టీజర్ రిలీజ్
- శ్రీనివాస్ రెడ్డి హీరోగా 'జంబ లకిడి పంబ'
- కథానాయికగా సిద్ధి ఇద్నాని
- కామెడీ ప్రధానంగా సాగే కథ
"నాకు విడాకులు కావాలి సార్" అని లాయర్ తో హీరో భార్య అంటే .. " నాకేమైనా మావిడాకులు కావాలా .. నాకూ విడాకులే కావాలి సార్ " అని హీరో చెప్పే డైలాగ్ తో ఈ సినిమా టీజర్ మొదలవుతోంది. భార్యా భర్తలు ఇద్దరూ మొదట్లో ప్రేమగా ఉండటం .. ఆ తరువాత కీచులాడుకోవడం వంటి ఫన్నీ సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. ఒకరి గురించి ఒకరు స్నేహితుల దగ్గర చెప్పుకునే సీన్స్ తో, సినిమాలో కామెడీ పర్సెంటేజ్ కావాల్సినంత ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో వచ్చిన 'జంబ లకిడి పంబ' మాదిరిగానే, ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.