అమెరికా అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న 'జీరో' టీమ్

  • షారుక్ ఖాన్ హీరోగా 'జీరో'
  • ఆయన కెరియర్లో మరో ప్రయోగాత్మక చిత్రం 
  • దర్శకుడిగా ఆనంద్ ఎల్.రాయ్
బాలీవుడ్ అగ్రకథానాయకులలో షారుక్ ఖాన్ ఒకరుగా కనిపిస్తారు. మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ, ఆ పాత్రల్లో తన సత్తాను చాటుకోవడం వల్లనే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. 'జీరో' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకి షారుక్ ఖాన్ ఒక నిర్మాత కాగా, ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

కథా పరంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను అమెరికాలోని 'అలబామా'లోని అంతరిక్ష రాకెట్ కేంద్రంలో చిత్రీకరించనున్నారు. ముంబైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లిన షారుక్, అక్కడి అధికారులతో చర్చించి అందుకోసం అనుమతులను పొందారు. ఈ సినిమాలో అనుష్క శర్మ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా, స్టార్ హీరోయిన్ పాత్రలో కత్రినా కైఫ్ అలరించనుంది. ఆమె అభిమాని అయిన మరుగుజ్జుగా షారుక్ కనిపించనుండటం విశేషం.  

Go Back to Shorts
shashrukh khan
Anushka Sharma
kathrina

More Telugu News