బ్యాటింగ్ తో ఆకట్టుకోవడం ఆనందంగా ఉంది: సంజు శాంసన్

  • దేశవాళీ సీజన్ లో ఆటగాడిగా మెరుగుపడ్డాను
  • ఐపీఎల్ ను ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది
  • క్రికెట్ లో పరుగులు సాధించడం ఎప్పుడూ మంచిదే
ఆటగాడిగా నిరూపించుకోవడం ఆనందంగా ఉందని కేరళ రంజీ, ఐపీఎల్ లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆటగాడు సంజు శాంసన్‌ అన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 45 బంతుల్లో 92 పరుగులు సాధించడంతో అందరి దృష్టి తనపై పడిందని తెలిపాడు. ప్రస్తుతం తాను సరైన దిశలో నడుస్తున్నానని, ఇదే జోరు మున్ముందు కొనసాగిస్తానని సంజు శాంసన్‌ చెప్పాడు. క్రికెట్ లో పరుగులు సాధించడం ఎప్పుడూ మంచిదేనని అన్నాడు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఐపీఎల్‌ ను ఆసక్తిగా చూస్తోందని చెప్పాడు. దేశవాళీ సీజన్ లో సత్తా చాటి ఆటగాడిగా ఎంతో మెరుగుపరుచుకున్నానని అన్నాడు. మ్యాచ్‌ ఏదైనా జట్టు ప్రణాళికలు ఇంచుమించు ఒకేలా ఉంటాయని చెప్పాడు. దూకుడుగా ఆడడమే జట్టు వ్యూహమని చెప్పాడు. హోం గ్రౌండ్ జైపూర్ లో విజయపరంపరను కొనసాగించాలనుకుంటున్నామని చెప్పాడు. జైపూర్ పిచ్ కేరళలో మాదిరిగానే ఉంటుందని సంజు శాంసన్ చెప్పాడు. 
Go Back to Shorts
Cricket
ipl
sanju samson

More Telugu News