Madhya Pradesh: 70 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడ్డ పెళ్లివారి ట్రక్... 15 మంది మృతి

షార్ట్స్‌లో చూడండి
మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళుతున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తూ సోన్ నదిలో పడిపోయింది. ఈ బస్సు జోగ్దాహో బ్రిడ్జిపై వెళుతున్న వేళ, అదుపుతప్పి 70 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోగా, 12 మంది అక్కడికక్కడే, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ఘటన విషయం తెలియగానే అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు తక్షణ సాయం అందిస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Madhya Pradesh
Bus
Road Accident

More Telugu News