ఆ రెండేళ్లు నరకం చూశా: అనుపమ పరమేశ్వరన్
- మాజీ ప్రియుడు తనను మానసికంగా, శారీరకంగా హింసించాడన్న అనుపమ
- దుస్తుల నుంచి సినిమాల వరకు ప్రతీ విషయంలో కంట్రోల్ చేశాడని ఆరోపణ
- అనుపమ వ్యాఖ్యలు ప్రముఖ హీరో కుమారుడి గురించేనంటూ ఊహాగానాలు
- డిప్రెషన్, పానిక్ ఎటాక్స్‌తో బాధపడినట్లు తెలిపిన నటి
ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన గతానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించింది. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉండి 'నార్సిసిస్టిక్ అబ్యూజ్' (మానసిక వేధింపుల)కు గురయ్యానని, శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాలను పంచుకున్నప్పటికీ, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె గోప్యంగా ఉంచింది.
"ప్రేమ పేరుతో నా జీవితంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి, నన్ను పూర్తిగా తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించాడు. నేను ధరించే దుస్తులు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అంశాలు, చివరికి ఎంచుకునే సినిమాల విషయంలోనూ ఆయనే ఆంక్షలు విధించేవాడు. నటనకు స్వస్తి పలకాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. పరిచయమైన మూడు నెలలకే నిశ్చితార్థం, వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడు. అది ప్రేమ కంటే నన్ను నియంత్రించే ప్రయత్నంగా అనిపించడంతో వాయిదా వేస్తూ వచ్చాను" అని వివరించింది.
ఆ బంధం కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఆందోళనకు గురయ్యానని, ఫలితంగా శారీరకంగానూ కుంగిపోయి బరువు తగ్గానని అనుపమ ఆవేదన వ్యక్తం చేసింది. "షూటింగ్ సెట్స్‌లో క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేదాన్ని. తరచూ పానిక్ ఎటాక్స్‌కు గురయ్యేదాన్ని. చివరికి నా సొంత తమ్ముడిని తాకడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. నా కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని అందుకున్న 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా ఈ మానసిక వేదన కారణంగానే హాజరు కాలేకపోయాను" అని ఆమె గుర్తుచేసుకుంది.
అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఆమె ప్రస్తావించిన వ్యక్తి ఆయనే అయి ఉండవచ్చని నెటిజన్లు, కొన్ని మీడియా వర్గాలు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, చాలా కాలం తర్వాత ఈ మానసిక గాయం నుంచి తాను కోలుకున్నానని, ఇటువంటి విషపూరిత బంధాలలో చిక్కుకున్న వారికి తన అనుభవం ఒక హెచ్చరికగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బహిర్గతం చేసినట్లు అనుపమ స్పష్టం చేసింది.