‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఫస్ట్ లుక్ విడుదల.. మన్మోహన్ సింగ్ లా కుదిరిన అనుపమ్ ఖేర్!
- ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో పుస్తకం రాసిన సంజయ్ బారు
- మన్మోహన్ సింగ్ కు మీడియా అడ్వైజర్ గా పని చేసిన సంజయ్
- వచ్చే డిసెంబర్ 21న విడదల
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ లుక్ లో అనుపమ్ ఖేర్ అతికినట్టు సరిపోయారు. ‘‘సినిమాలో డా. మన్మోహన్ సింగ్ లుక్ ని షేర్ చేయడం హ్యాపీగా ఉంది’’ అని అనుపమ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాను వచ్చే డిసెంబర్ 21న విడదల చేయనున్నట్టు తెలిపారు.