KTR: కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని!: తెలంగాణ మంత్రి కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని అని, భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ పార్టీని మూసేయాలని మహాత్మా గాంధీ కూడా అన్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణ, ఆంధ్రాకు జవహర్ లాల్ నెహ్రూ బలవంతపు పెళ్లి చేశారని, అనంతరం ముల్కీ రూల్స్ విషయంలో ఇందిరా గాంధీ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని విమర్శించారు. చివరకు కేసీఆర్ నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజలంతా తిరగబడితే, ఇక చేసేదేమీ లేక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తోందని కేటీఆర్ అన్నారు. అలాగే, తమ సర్కారు ఇంటింటికి తాగునీరు ఇస్తుందని, ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని తెలిపారు.
Go Back to Shorts
KTR
Telangana
Andhra Pradesh
TRS

More Telugu News