అర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ కు అత్యవసర ఓపెన్ హార్ట్ సర్జరీ
- లాస్ ఏంజెలెస్ లో ఆర్నాల్డ్ కు అత్యవసర సర్జరీ
- పాత పుల్మోనిక్ వాల్వ్ తొలగింపు.. కొత్త వాల్వ్ అమరిక
- సర్జరీ తర్వాత 'అయాం బ్యాక్' అన్న అర్నాల్డ్
తాజా సర్జరీలో 1997లో ఆయనకు అమర్చిన పుల్మోనిక్ వాల్వ్ ను తొలగించి, ఆ స్థానంలో కొత్త వాల్వ్ ను అమర్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రతినిధి డేనియల్ కెచెల్ మాట్లాడుతూ, 1997లో అమర్చిన వాల్వ్ కాలపరిమితి ముగిసిందని... ఈ నేపథ్యంలో దాన్ని రీప్లేస్ చేయించుకునేందుకు అర్నాల్డ్ మొగ్గు చూపారని తెలిపారు. ఎంతో కీలకమైన ఈ భాగాన్ని విజయవంతంగా అమర్చారని అన్నారు. 70 ఏళ్ల ఈ 'టెర్మినేటర్' హీరో ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.
మరోవైపు, సర్జరీ తర్వాత తొలిసారి ఆయన మాట్లాడుతూ, 'అయాం బ్యాక్' అని అన్నారు. 2003 నుంచి 2011 వరకు ఆయన కాలిఫోర్నియా గవర్నర్ గా కూడా పదవీ బాధ్యతలను నిర్వహించారు.