‘రంగస్థలం’ గురించి, మా 'ఆర్ సీ' గురించి సూపర్ డూపర్ రిపోర్ట్స్ వింటున్నా!: అల్లు శిరీష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘రంగస్థలం’ గురించి, మా 'ఆర్ సీ' గురించి సూపర్ డూపర్ రిపోర్ట్స్ వింటున్నా!: అల్లు శిరీష్

  • 'రంగస్థలం'కు వస్తున్న రెస్పాన్స్ పై శిరీష్ ఆనందం  
  • ఈరోజు రాత్రి సినిమాకు వెళ్తున్నాను
  • ఓ ట్వీట్ చేసిన అల్లు శిరీష్
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ ఈరోజు విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రంపై  ‘మెగా’ ఫ్యామిలీ యువహీరో అల్లు శిరీష్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘రంగ..రంగా..రంగస్థలానానానానానా!!! రంగస్థలం గురించి, మరి ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఆర్ సీ (రామ్ చరణ్) గురించి సూపర్ డూపర్ రిపోర్ట్స్ వింటున్నాను. ఈరోజు రాత్రి సినిమాకు వెళ్తున్నాను..’ అని శిరీష్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘రంగస్థలం’ లో రామ్ చరణ్ సరసన సమంత నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, చంద్రబోస్ పాటలు రాశారు. 
rangasthalam
allu sirish

More Telugu News