నితిన్ గురించి 'ఛల్ మోహన్ రంగ' హీరోయిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితిన్ గురించి 'ఛల్ మోహన్ రంగ' హీరోయిన్

  • నితిన్ మంచి వ్యక్తిత్వం వున్నవాడు 
  • అందరితో సరదాగా ఉంటాడు 
  • తాను నిర్మాతననే ఫీలింగ్ ను చూపించడు    
తెలుగు తెరపై మంచి క్రేజ్ వున్న యువ కథానాయకులలో నితిన్ ఒకరు. 'లై' సినిమా మిగిల్చిన చేదు అనుభవం కారణంగా, 'ఛల్ మోహన్ రంగ'తో తప్పకుండా హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నాడు. పరాజయం పాలైన 'లై' సినిమాలోని హీరోయిన్ మేఘా ఆకాశ్ నే .. ఈ సినిమాకి నితిన్ ఎంపిక చేసుకోవడం విశేషం.

ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతోన్న సందర్భంగా ఆమె ఈ సినిమాను గురించి మాట్లాడుతూ, నితిన్ గురించి ప్రస్తావించింది. " ఈ సినిమాకి నితిన్ కేవలం హీరో మాత్రమే కాదు .. నిర్మాత కూడా. అయినా ఆయన ఈ సినిమాకి తనే నిర్మాతననే ఫీలింగ్ ను ఎక్కడా వ్యక్తం చేయలేదు. అందరితోనూ ఆయన చాలా సరదాగా .. ఫ్రెండ్లీగా ఉంటాడు. 'లై' సినిమా విషయంలోనే ఆయన మంచితనం గురించి నాకు అర్థమైంది. అందుకే ఈ సినిమాను వెంటనే అంగీకరించాను" అంటూ చెప్పుకొచ్చింది.  
megha akash

More Telugu News