'భాగమతి' తరువాత ఒక సినిమాకే అనుష్క ఓకే చెప్పింది .. కారణం అదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భాగమతి' తరువాత ఒక సినిమాకే అనుష్క ఓకే చెప్పింది .. కారణం అదే!

  • 'భాగమతి' హిట్ తో అనుష్క 
  • గౌతమ్ మీనన్ సినిమాకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ 
  • తమిళంతో పాటు తెలుగులోను  
తెలుగులో కథానాయిక ప్రాధాన్యత కలిగిన భారీ చిత్రం చేయాలనుకునే దర్శక నిర్మాతలు ముందుగా అనుష్క గురించే ఆలోచన చేస్తారు. నటన పరంగా అనుష్క అంతటి మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవల వచ్చిన 'భాగమతి' సినిమా .. అది సాధించిన విజయం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించినా, అనుష్క వరుస సినిమాలు ఒప్పుకోలేదు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మాత్రమే ఆమె అంగీకరించింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా మొదలుకావడానికి ఇంకా కొంత సమయం ఉండటంతో, ఈ లోగా బరువు తగ్గడంపై అనుష్క దృష్టి పెట్టాలనుకుంటోందట. అందువల్లనే కాస్త బరువు తగ్గే వరకూ వేరే సినిమాలను ఒప్పుకునే ఉద్దేశంతో ఆమె లేదని అంటున్నారు.  
anushka

More Telugu News