సుధీర్ తో పెళ్లి గురించి రష్మిని క్లారిటీ అడిగిన అభిమానులు
- ఒక టీవీ షోలో సుధీర్ - రష్మి పెళ్లి తతంగం
- అభిమానుల్లో సందేహాలు
- గడుసుగా సమాధానమిచ్చిన రష్మి
తాజాగా ఒక షో కోసం సుధీర్ కి .. రష్మికి పెళ్లి జరిగినట్టుగా చూపించేశారు. పెళ్లి తంతు సహజంగా అనిపించడంతో .. నిజంగానే వీళ్లు పెళ్లి చేసుకున్నారా? అనే సందేహం అభిమానుల్లో ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో " మీరు నిజంగానే సుధీర్ ని పెళ్లి చేసుకున్నారా .. లేదా? .. ఈ విషయంలో మాకు క్లారిటీ కావాలి" అనే ప్రశ్నను ఒక అభిమాని ట్విట్టర్లో రష్మిని అడిగేశాడు. దాంతో "క్రమం తప్పకుండా ఈ షోను చివరి వరకూ చూడండి .. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది" అంటూ రష్మి గడుసుగా సమాధానమిచ్చింది