ఇక మా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పాలి!: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్
- ఏపీ అభివృద్ధి అన్ని పార్టీల కన్నా ఎక్కువగా కట్టుబడి ఉన్నాం
- ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది
- ఇప్పటివరకు చంద్రబాబు మాకు ప్రశ్నలు వేశారు
ఎన్డీఏ నుంచి వైదొలగడం ద్వారా, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా టీడీపీ తనంతట తానుగా తమకు వ్యతిరేకంగా నిలబడిందని రామ్ మాధవ్ అన్నారు. టీడీపీ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు రాబోయే రోజుల్లో తాము సమాధానాలు చెబుతామని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు తమకు ప్రశ్నలు వేశారని, ఇకపై తాము చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తామని వాటన్నింటికీ ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు.