దుమ్మురేపేస్తోన్న 'కిరాక్ పార్టీ' .. ఫస్టు డే వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుమ్మురేపేస్తోన్న 'కిరాక్ పార్టీ' .. ఫస్టు డే వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'కిరాక్ పార్టీ'
  • యూత్ నుంచి విశేషమైన ఆదరణ 
  • తొలిరోజున 6.18 కోట్ల వసూళ్లు
నిఖిల్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'కిరాక్ పార్టీ' సినిమా తెరకెక్కింది. సిమ్రాన్ పరీంజ .. సంయుక్త హెగ్డే కథానాయికలుగా నటించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమా, ఊహించిన విధంగానే వాళ్లకి కనెక్ట్ అయ్యిందనే విషయాన్ని ఈ సినిమా తొలిరోజు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. నైజామ్ లో 1.39 కోట్లు .. సీడెడ్ లో 78 లక్షలను .. వైజాగ్ లో 62 లక్షలు .. తూర్పు గోదావరిలో 38 లక్షలు .. పశ్చిమ గోదావరిలో 28 లక్షలు .. గుంటూరులో 42 లక్షలు.. నెల్లూరులో 21 లక్షలు .. కృష్ణాలో 31 లక్షలు.. యూఎస్ ఏలో 1.02 కోట్లు .. ఇతర ప్రాంతాల్లో 59 లక్షలు రాబట్టింది. ఇలా మొదటిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.18 కోట్లను వసూలు చేసింది. 
nikhil
simran pareenja

More Telugu News