దుమ్మురేపేస్తోన్న నితిన్ ఊరమాస్ సాంగ్
- నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
- సంగీత దర్శకుడిగా తమన్
- ఏప్రిల్ 5వ తేదీన విడుదల
'రంగా .. రంగా .. రంగా .. చిందేయి సామి రంగా .. శివమెత్తు సుబ్బరంగా .. ఛల్ మోహన్ రంగ' అంటూ మాంచి జోరుగా ఈ సాంగ్ కొనసాగుతోంది. తెలంగాణలో బాగా పాప్యులర్ అయినా 'నువు పెద్దపులి .. నువ్వు పెద్దపులి' సాంగ్ తరహాలో ఈ బీట్ దుమ్మురేపేస్తోంది. బోనాల జాతర సందర్భంలో వచ్చే పాటగా దీనిని చిత్రీకరించారు. తమన్ కూర్చిన ఈ ఊరమాస్ బాణీకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సాంగ్ వీలైనన్ని విజిల్స్ ను వసూలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.