పంటకు దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ప్లెక్సీలు...ఆంధ్ర రైతు వినూత్న ఆలోచన..!
- వరిపంటకు కంటిదిష్టి మళ్లించేందుకు శృంగార తార ప్లెక్సీలు
- దిగుబడి బాగా పెరిగిందంటున్న రైతు..!
- దిష్టి నివారణకు నెల్లూరు రైతు వినూత్న ఆలోచన
జనాల కళ్లు ప్లెక్సీలపై పడటంతో తన పంటకు కంటిదిష్టి తగ్గిందని, తద్వారా దిగుబడి పెరిగిందని రెడ్డి నవ్వుతూ చెబుతున్నాడు. తొలుత జనాల దృష్టిని మళ్లించేందుకు కొన్ని రోజులు చాలా కష్టపడ్డానని, తన మదిలో వచ్చిన మెరుపు లాంటి ఆలోచనతో సన్నీ ప్లెక్సీలను ఏర్పాటు చేశానని, దాంతో దిష్టి బెడద బాగా తగ్గిపోయిందని అతను అంటున్నాడు.
సన్నీ లియోన్ ప్లెక్సీలపై "ఒరేయ్....నన్ను చూసి ఏడ్వకురా" అని రాసుంది. సాధారణంగా కంటిదిష్టి తగలకుండా రైతులు తమ పంట పొలాల వద్ద దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం కద్దు. కానీ చెంచు రెడ్డి కాస్త క్రియేటివ్‌గా ఆలోచించి ఇలా సన్నీ లియోన్ ప్లెక్సీలు పెట్టి తన పంట దిగుబడిని పెంచుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరికొందరికి ఆయన ప్రయత్నం ఆదర్శంగా మారినా అతిశయోక్తి కాదు.