శర్వానంద్ మూవీ నుంచి ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్
- హను రాఘవపూడితో శర్వానంద్
- కథానాయికగా సాయిపల్లవి
- వేసవిలో రిలీజ్ చేయాలనే ఆలోచన
ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి 'పడి పడి లేచే మనసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ సాధారణమైన యువకుడిగా డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్ లో శర్వానంద్ కనిపిస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.