జయలలిత సమాధి వద్ద కలకలం .. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
- మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్ద సంఘటన
- మధురైకి చెందిన కానిస్టేబుల్ అరుల్ ఆత్మహత్య
- ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన డ్యూటీలో వున్న మిగిలిన పోలీసులు, అతన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అరుల్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చెన్నై నగర కమిషనర్ ఏకే విశ్వనాథన్ చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.