హర్మూజ్ జలసంధి మూతపడలేదు.. 1000కి పైగా ఓడలకు రక్షణగా అమెరికా బలగాలు!
- హర్మూజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ ప్రచారాన్ని ఖండించిన అమెరికా
- సుమారు 50 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని స్పష్టీకరణ
- ఇరాన్ పోర్టులపై ఆంక్షలు.. నిబంధనలు మీరిన 30 నౌకలను మళ్లించిన నౌకాదళం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గం 'హర్మూజ్ జలసంధి'పై అమెరికా సైన్యం కీలక ప్రకటన చేసింది. జలసంధిని తాము పూర్తిగా మూసివేశామని ఇరాన్ చేస్తున్న ప్రచారాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఖండించింది. అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఈ మార్గం తెరిచే ఉందని, తమ బలగాల రక్షణలో వాణిజ్యం సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది.
మే నెల ఆరంభం నుంచి ఇప్పటివరకు తమ సైనిక బలగాలు 1,000కి పైగా వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటేందుకు సహాయపడ్డాయని సెంట్‌కామ్ వెల్లడించింది. వీటి ద్వారా ప్రపంచ అవసరాల కోసం సుమారు 50 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని తెలిపింది. ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్‌కు అంతర్జాతీయ జలమార్గాలను మూసివేసే అధికారం లేదని తేల్చిచెప్పింది.
ఒకవైపు జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి భరోసా ఇస్తూనే, మరోవైపు ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నట్లు అమెరికా పేర్కొంది. జులై చివరినాటికి నిబంధనలు ఉల్లంఘించిన 30 నౌకలను తమ నౌకాదళం దారి మళ్లించిందని, రెండింటిని అడ్డుకుందని తెలిపింది. అయితే, మానవతా సాయం కింద నిత్యావసరాలు, మందులు తీసుకెళ్తున్న 30 నౌకలను అనుమతించినట్లు వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం ముడి చమురు, సహజ వాయువులో (ఎల్ఎన్‌జీ) దాదాపు 20 శాతం హర్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.