రెండేళ్ల తర్వాత తొలిసారి మీడియా ముందుకు షేక్ హసీనా!

Sheikh Hasina to appear before media for the first time in two years
  • నేడు తొలిసారి మీడియా ముందుకు రానున్న షేక్ హసీనా
  • భారత్‌లో ఆశ్రయం పొంది నేటికి సరిగ్గా రెండేళ్లు
  • ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రసంగం
  • ఈ సమావేశంతో తమకు సంబంధం లేదన్న భారత ప్రభుత్వం
  • బంగ్లాదేశ్ ఆరా తీయడంతో స్పష్టతనిచ్చిన విదేశాంగ శాఖ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు రానున్నారు. స్వదేశంలో అధికారం కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె, బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడనున్నారు. భారత్‌కు వచ్చిన తర్వాత ఆమె బహిరంగంగా ప్రసంగించడం ఇదే మొదటిసారి.

2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన భారీ విద్యార్థి ఉద్యమం కారణంగా ఆమె తన పదవిని కోల్పోయి దేశం విడిచి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్న హసీనా, దేశాన్ని వీడి సరిగ్గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అయితే, ఈ మీడియా సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమమని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. “ఈ సమావేశాన్ని ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భారత ప్రభుత్వ ప్రమేయం లేదు” అని ఆయన పేర్కొన్నారు.

షేక్ హసీనా విలేకరుల సమావేశంపై స్పష్టత ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే భారత్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
Sheikh Hasina
Bangladesh
Press Conference
India
Randhir Jaiswal
Ministry of External Affairs

More Telugu News