Sridevi: ఒక్క క్షణం కూడా బాధపెట్టకుండా పోయిన శ్రీదేవి ప్రాణం: బోనీ కపూర్ ఫ్రెండ్ కోమల్ నాహ్తా విశ్లేషణ

షార్ట్స్‌లో చూడండి
శ్రీదేవి మరణానికి ముందు ఏం జరిగిందన్న విషయాన్ని ఆమె భర్త బోనీ కపూర్, తన బాల్యమిత్రుడు కోమల్ నాహ్తాకు వెల్లడించగా, బోనీ చెప్పిన విషయాలను ఆయన విశ్లేషిస్తూ, శ్రీదేవి వేదన అనుభవించినట్టు అనిపించలేదని అన్నారు. బాత్ టబ్ పూర్తిగా నీటితో నిండివున్నా చుక్క నీరు కూడా కింద పడలేదని, అంటే బాత్ టబ్ లో ఆమె చేతులు లేదా కాళ్లు ఆడించటం వంటివి చేయలేదని తన ట్విట్టర్ ఖాతాలో చెప్పారు.

 శ్రీదేవి బాత్ టబ్ లో పడుకుని నిద్రపోయి, నీట మునిగి ఉండవచ్చని అంచనా వేశారు. ఇదే సమయంలో నీట మునిగి ఆపై క్షణాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉంటుందని కూడా భావిస్తున్నట్టు చెప్పారు. తన అభిప్రాయాలను కోమల్ సొంతంగా నిర్వహిస్తున్న బ్లాగ్ లో వెల్లడించారు. శ్రీదేవిని ఒక్క క్షణం కూడా బాధ పెట్టకుండా ప్రాణం పోయినట్టు తనకు అనిపించిందని చెప్పారు.
Go Back to Shorts
Sridevi
Boney Kapoor
Komal Nahta
Dubai

More Telugu News