అన్నీ చెబుతున్నారు... శ్రీదేవి ఎలా స్పృహతప్పిపోయిందో చెప్పరేం?: నిలదీస్తున్న అభిమానులు
- స్పృహతప్పిపోయి బాత్ టబ్ లో పడి మృతి చెందిన శ్రీదేవి
- శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
- సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం
అయితే ఆ నివేదికలో ఆమె స్పృహ తప్పిపడిపోవడానికి గల కారణాలను వివరించలేదు. దీంతో అభిమానుల్లో ఆ అనుమానం అలాగే ఉండిపోయింది. వివాహ వేడుకలో సరదాగా గడిపిన ఆమెకు పెద్దగా అనారోగ్యం లేదని, ఆమెకు మద్యం అలవాటు కూడా లేదని అమర్ సింగ్ చెప్పడంతో మరి ఆమె స్పృహతప్పడానికి గల కారణమేంటని వారు నిలదీస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా దీనిపై స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.