Sridevi: శ్రీదేవి జీవితం ఆధారంగా దర్శకుడు వర్మ సినిమా?

షార్ట్స్‌లో చూడండి
సినీ నటి శ్రీదేవిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూపించే అభిమానం, ఆరాధనా భావం అంతాఇంతా కాదు. దీనికి కొలమానం కూడా లేదనడం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. శ్రీదేవి మృతి అనంతరం వర్మ ఎంతగా ఆవేదన చెందారో ఆయన ట్వీట్లే ఇందుకు నిదర్శనం. ఆమె మరణవార్త తెలిసినప్పటి నుంచి అంత్యక్రియలు జరిగే వరకు, ఆపై కూడా వర్మ ట్వీట్లు వస్తూనే ఉన్నాయి.

శ్రీదేవిపై అంతగా అభిమానం ఉన్న వర్మ, ఆమె జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని వర్మకు సన్నిహితుడు, గీత రచయిత సిరాశ్రీ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన కథ తుదిరూపు సంతరించుకోగానే, వర్మ అధికారికంగా ప్రకటిస్తారని సిరాశ్రీ చెప్పారు. కాగా, శ్రీదేవి కథానాయికగా వర్మ దర్శకత్వంలో ‘క్షణక్షణం, ‘గోవిందా గోవిందా’ తెరకెక్కిన విషయాలు తెలిసిందే.


Go Back to Shorts
Sridevi
ram gopal varma

More Telugu News