శ్రీదేవి అలా సినిమాల్లోకి వెళ్లింది: ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి
- చిన్నప్పుడు శ్రీదేవి మా ఇంట్లో ఆడుకునేది
- ఆమెను సినిమాల్లోకి పంపించాలనేది తల్లి ఆసక్తి
- శ్రీదేవి మొదట తమిళంలో .. ఆ తరువాత తెలుగులో చేసింది
"శ్రీదేవి ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిందే. ఆమె తల్లికి సినిమా పరిశ్రమకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ఆమెకి సినిమాలపై ఒక అవగాహన కలిగింది. దాంతో శ్రీదేవిని సినిమాల్లోకి పంపించాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి మరింత శ్రద్ధ తీసుకుంది. మొదట శ్రీదేవి ఒక తమిళ సినిమా చేసింది .. ఆ తరువాత తెలుగులో 'మా నాన్న నిర్దోషి'లో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో మంచి పేరు రావడంతో, ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చాయి' అని చెప్పుకొచ్చారు.