శ్రీదేవి నాకు చెల్లెలు లాంటిది... అలాంటి వదంతులు సృష్టించొద్దు!: కమలహాసన్
- కల్పిత వార్తలపై కమల్ అసహనం
- శ్రీదేవి నాకు సోదర సమానురాలు
- శ్రీదేవి తల్లి చేతి గోరుముద్దలు తిన్నాను
లేని పోని వదంతులు సృష్టించి ఇబ్బంది పెట్టవద్దని ఆయన మీడియాను కోరారు. కాగా, శ్రీదేవి, కమలహాసన్ జోడీ అత్యంత విజయవంతమైన జోడీగా కోలీవుడ్ లో పేరొందింది. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ లు గా నిలిచాయి. తాజాగా కమల్ రాజకీయ పార్టీని పెట్టారు. ఈ నేపథ్యంలో శ్రీదేవితో ఆయనకు సంబంధాలను అంటగడుతూ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. అందుకే, ఆయన తాజాగా ఈ వివరణను ఇచ్చారు.