Sridevi: శ్రీదేవి ఎక్కడ సెటిల్ కావాలనుకుందో తెలుసా?

షార్ట్స్‌లో చూడండి
శ్రీదేవి మరణ విషాదం నుంచి ఆమె అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. యావత్ దేశం ఇంకా శోకసంద్రంలోనే ఉంది. వాస్తవానికి శ్రీదేవి చాలా మితభాషి. చాలా తక్కువగా మాట్లాడేవారు. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువే. ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలను ఓ సారి గుర్తు చేసుకుందాం.

సినీ కెరీర్ ముగిసిన తర్వాత మీరు ఎక్కడ సెటిల్ అవుతారనే ప్రశ్నకు సమాధానంగా... విదేశాల్లో సెటిల్ కావాలనిపిస్తోందని చెప్పారు. తనకు ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ అంటే ఇష్టమని... విదేశాల్లో అయితే వాటిని నచ్చినట్టు తినవచ్చని తెలిపారు. ఇక్కడ కూడా ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్స్, మిల్స్ షేక్స్ ఉన్నప్పటికీ... వాటిని ఆస్వాదించేందుకు సమయం మాత్రం దొరకడం లేదని నవ్వుతూ చెప్పారు.
Go Back to Shorts
Sridevi
destination

More Telugu News