Sridevi: ఆ షూటింగ్ సమయంలో శ్రీదేవి పడిపోయింది: ప్రముఖ నిర్మాత అశ్వనీదత్

షార్ట్స్‌లో చూడండి
అందం .. అభినయం కలగలిసిన అద్భుతమైన కథానాయికగా శ్రీదేవి అభిమానుల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అనంతలోకాలకు శ్రీదేవి తరలివెళ్లడం పట్ల ఆయన ఆవేదన చెందారు. శ్రీదేవితో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన, నటనపట్ల ఆమెకు గల అంకితభావం గురించి తాజాగా ప్రస్తావించారు.

" తిరుపతిలో తెల్లవారు జాము 4 గంటలకు 'గోవిందా .. గోవిందా' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా, లోబీపీతో శ్రీదేవి పడిపోయారు. ఆమె పెదవి పగిలి రక్తం వస్తుండటంతో .. చెన్నై ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే, తన వలన షూటింగ్ ఆగిపోకూడదంటూ .. లోకల్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి షూటింగులో పాల్గొన్నారు. ఎన్టీఆర్ తరువాత అంతటి క్రమశిక్షణను .. అంకితభావాన్ని నేను మళ్లీ శ్రీదేవిలోనే చూశాను" అని ఆయన అన్నారు . 
Go Back to Shorts
Sridevi

More Telugu News