sridevi: శ్రీదేవికి స్థానికుల ఘన నివాళి... హోలీ వేడుకలు రద్దు

షార్ట్స్‌లో చూడండి
ముంబైలో శ్రీదేవి నివాసం ఉండే గ్రీన్ ఏకెర్స్ ప్రాంత వాసులు తమ అభిమాన నటికి ఘన నివాళి అర్పించారు. శ్రీదేవి మృతికి సంతాపంగా మార్చి 2న హోలీ వేడుకలను రద్దు చేస్తూ గ్రీన్ ఏకెర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది

‘‘మా సభ్యురాలు శ్రీదేవి విషాద మరణం నేపథ్యంలో, తన నటనతో మాకు వినోదాన్ని పంచిన ఆమె పట్ల గౌరవ సూచకంగా మార్చి 2న హోలీ వేడుకలను రద్దు చేయాలని నిర్ణయించాం. దీంతో ఆ రోజు సంగీతం, రెయిన్ డ్యాన్స్, రంగు నీళ్లు చిమ్ముకోవడాలు వంటివి ఏవీ ఉండవు’’ అని సొసైటీ తన ప్రకటనలో పేర్కొంది.
Go Back to Shorts
sridevi

More Telugu News