Tollywood: విడిపోయి కొట్టుకోండి.. ప్రజలను పిచ్చోళ్లను చెయ్యొద్దు!: బీజేపీ-టీడీపీపై తమ్మారెడ్డి విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు అనడం, నిధులిచ్చామని బీజేపీ నేతలు చెబుతుండటంపై ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆరు నెలల క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనివ్వని టీడీపీ నేతలు ప్రస్తుతం దుమ్మెత్తిపోస్తున్నారని, టీడీపీ నేతలు, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రజలు అయోమయంలో పడిపోయారని అన్నారు.

‘నా ఆలోచన’ ద్వారా తమ్మారెడ్డి మాట్లాడుతూ, ‘ప్రజలను తికమకపెట్టొద్దు. విడిపోయి కొట్టుకోండి. రెండు ప్రభుత్వాల్లో (కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ) మీరే ఉంటారు..ఒకరినొకరు తిట్టుకుంటారు! టీవీ ఛానెల్స్ లో అల్లరి చేస్తారు! పేపర్లలో అల్లరి చేస్తారు! జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా? లేకపోతే, జనం పిచ్చోళ్లని అనుకుంటున్నారా? మీరు (బీజేపీ-టీడీపీ) ఏమనుకుంటున్నారో ముందు తేల్చండి! నిజానిజాలు చెప్పండి! అదే నా కోరిక’ అని తమ్మారెడ్డి ఘాటుగా మాట్లాడారు.
Go Back to Shorts
Tollywood
tamma reddy

More Telugu News