చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అల్లు శిరీష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అల్లు శిరీష్

  • అన్నయ్య, నేను చిన్నప్పుడు కుంగ్ ఫూ నేర్చుకున్నాం
  • చిన్నప్పుడు ఎంతో బొద్దుగా ఉండేవాడిని
  • నాటి ఫొటోలను పోస్ట్ చేసిన శిరీష్
  • ఆ ఫొటోల్లో నటుడు ఆది పినిశెట్టి 
యువ హీరో అల్లు శిరీష్ తన చిన్ననాటి ఫొటోలను పోస్ట్ చేశాడు. తన అన్నయ్య అల్లు అర్జున్, తాను కలసి కుంగ్ ఫూ నేర్చుకుంటూ చిన్నప్పుడు దిగిన ఈ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో అల్లు అర్జున్, తాను కుంగ్ ఫూ నేర్చుకున్నప్పుడు దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ, ఈ ఫొటోల్లో తమతో పాటు మరో నటుడు కూడా ఉన్నాడని, ఎవరో ఊహించండి? అని అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. నాడు ఎంతో బొద్దుగా ఉన్న తాను కుంగ్ ఫూ నేర్చుకోవడం ద్వారా ఫిట్ నెస్ పొంది తన రూపాన్ని మార్చుకున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.  

ఇందుకు స్పందించిన నెటిజన్లు ఆ నటుడు ఆది పినిశెట్టి అని సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన శిరీష్.. చాలా మంది నెటిజన్లు కరెక్టుగా ఊహించారని, ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఇరవై ఏళ్ల క్రితమే ‘సరైనోడు’ సినిమా క్లైమాక్స్ దేవుడికి తెలిసుండచ్చని శిరీష్ చమత్కరించాడు. కాగా, 'సరైనోడు' సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, ఆది విలన్ పాత్రలో నటించాడు.
Tollywood
Allu Arjun]
allu sirish

More Telugu News