అందుకే నన్ను అపార్థం చేసుకునేవారు: సీనియర్ నటుడు జీవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే నన్ను అపార్థం చేసుకునేవారు: సీనియర్ నటుడు జీవా

  • నటుడిగా 43 ఏళ్ల ప్రయాణం 
  • 1000 సినిమాలకి పైగా చేశాను 
  • నాకు మొహమాటం బాగా వుంది
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను చేస్తూ .. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును జీవా సంపాదించుకున్నారు. ఎప్పుడు చూసినా ఎరుపెక్కిన కళ్లతో సీరియస్ గా కనిపిస్తూ, కామెడీని ఎక్కువగా చేయడం ఆయన ప్రత్యేకత. అలాంటి జీవా తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

" 43 ఏళ్లుగా నటుడిగా నా కెరియర్ కొనసాగుతోంది. లెక్కపెట్టుకోలేదు గానీ .. 1000 సినిమాలకి పైగా చేసి వుంటాను. ఇంతవరకూ ఎవరికీ పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు. అందుకు కారణం .. నాకు కొంచెం మొహమాటం ఎక్కువగా ఉండటమే. ఆర్టిస్ట్ కి ఉండకూడని మొహమాటం అనే లక్షణం .. నాకు వుంది. ఇప్పటికి కూడా షూటింగులో నా పని ఏదైతే ఉందో అది చూసుకుని వచ్చేస్తాను. కొత్తలో ఈ మొహమాటం మరీ ఎక్కువగా ఉండేది. డైలాగ్ పేపర్ పట్టుకుని ఓ మూలన కూర్చునేవాడిని. మిగతావారితో కలవకపోవడం వలన, నన్ను అపార్థం చేసుకునేవాళ్లు. అలా అపార్థం చేసుకునే అవకాశం వుందిలే అని సరిపెట్టుకునేవాడిని" అంటూ చెప్పుకొచ్చారు.     
jeeva

More Telugu News