వారిపై కఠిన చర్యలు తీసుకోండి: రాజస్థాన్ మంత్రికి లేఖ రాసిన బాలీవుడ్ నటి!
- జైపూర్ కోటలో ఏనుగును హింసించిన సంరక్షకులు
- కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రికి సోనాక్షి లేఖ
- పెటాకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సోనాక్షి
జైపూర్ అంబర్ కోటలో ఉన్న ఓ ఏనుగును ఎనిమిది మంది వ్యక్తులు కొడుతుండగా, అమెరికాకు చెందిన పర్యాటకులు ఆ ఘటనను ఫొటో తీశారు. ఈ ఫొటోల ఆధారంగా ఏనుగును హింసించిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని, ఏనుగులకు స్వేచ్ఛను ప్రసాదించాలని లేఖలో సోనాక్షి కోరారు. సోనాక్షి లేఖపై స్పందించిన అధికారులు... ఏనుగు సంరక్షకులకు నోటీసులు జారీ చేసి, దర్యాప్తు చేస్తున్నారు.