నితిన్ టీజర్ రిలీజ్ .. మూవీ రిలీజ్ డేట్ ఖరారైపోయాయి
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్
- పరిశీలనలో 'గుర్తుందా శీతాకాలం'
- ఈనెల 14న టీజర్ రిలీజ్
- ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల
ఈ నెల 12వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేయనున్నారు. ఇది ప్రేమకథా చిత్రం కావడం వలన .. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, ఈ నెల 14వ తేదీన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాను కూడా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో నితిన్ ఉండగా, ఈ మూవీ తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని మేఘా ఆకాశ్ ఆశపడుతోంది.