gazal srinivas: బెయిల్ పై విడుదలైన గజల్ శ్రీనివాస్.. నిర్దోషిగా బయటపడతానన్న గాయకుడు!

షార్ట్స్‌లో చూడండి
లైంగిక వేధింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్ పొందిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్ ను చంచల్ గూడ జైల్ నుంచి ఈరోజు రాత్రి విడుదల చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు విషయం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున తానేమీ మాట్లాడనని, నిర్దోషిగా బయటకొస్తానని చెప్పారు.

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వని గజల్, పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చుని..అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. కాగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ ఈరోజు మంజూరైంది. రూ.10 వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు ఇవ్వాలని, వారంలో రెండు సార్లు (ప్రతి బుధ, ఆది వారాలు) పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ ముందు నిందితుడు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
Go Back to Shorts
gazal srinivas
Hyderabad

More Telugu News