యాంకర్ ప్రదీప్ కు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!: తీర్పు వెల్లడించిన కోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాంకర్ ప్రదీప్ కు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!: తీర్పు వెల్లడించిన కోర్టు

  • మూడేళ్ల పాటు ప్రదీప్ లైసెన్స్ రద్దు
  • రూ.2,100 జరిమానా విధింపు
  • తీర్పు వెలువరించిన నాంపల్లి కోర్టు  
డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ప్రముఖ యాంకర్ ప్రదీప్  డ్రైవింగ్ లైసెన్స్ ను మూడేళ్ల పాటు రద్దు చేస్తూ నాంపల్లి న్యాయస్థానం తీర్పు నిచ్చింది. లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ప్రదీప్ కు రూ.2,100 జరిమానా కూడా విధించింది.

కాగా, ‘డ్రంకెన్ డ్రైవ్ కు వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేసిన మీరు మద్యం సేవించి వాహనం నడిపితే ఎలా?’ అని ప్రదీప్ ను న్యాయమూర్తి ప్రశ్నించినట్టు సమాచారం. ‘ఆ రోజు డ్రైవర్ లేనందున నేనే కారు డ్రైవ్ చేశాను’ అని ప్రదీప్ సమాధానం చెప్పారట. కాగా, గత ఏడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు.
anchor
pradeep
Hyderabad

More Telugu News