నేను హీరోగా చేసిన ఏ సినిమా ఆడలేదు: ధనరాజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను హీరోగా చేసిన ఏ సినిమా ఆడలేదు: ధనరాజ్

  • నేను హీరోగా సక్సెస్ కాలేకపోయాను 
  • కమెడియన్ గా చేసినవి కూడా కొన్ని ఆడలేదు 
  • కొన్ని పాత్రలు మాత్రం నన్ను నిలబెట్టేశాయి    
ఒకవైపున కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున హీరోగాను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ధన్ రాజ్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడాడు. "హీరోగా చేసిన సినిమాలు ఆడకపోవడం పట్ల మీరెలా స్పందిస్తున్నారు?" అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది.

 అప్పుడాయన స్పందిస్తూ .. "నేను హీరోగా చేసిన ఏ సినిమా సక్సెస్ కాలేదు. నిజం చెప్పాలంటే నేను పెద్ద ప్లాప్ హీరోను. అలాగే నేను కమెడియన్ గా చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ కాలేదు. అయితే నేను చేసిన కొన్ని సినిమాల్లోని పాత్రలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాగా ఆడని సినిమాల్లోనూ నా పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. 100 సినిమాల్లో 10 చెప్పుకోదగిన హిట్లు ఉంటేచాలు, ఓ 10 యేళ్ల పాటు కెరియర్ నడిచిపోతుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 
dhanraj

More Telugu News