52 రోజుల తరువాత తాళాలు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లిన సంగీత.. టీవీ లైవ్‌లో చూసిన భర్త శ్రీనివాస రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

52 రోజుల తరువాత తాళాలు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లిన సంగీత.. టీవీ లైవ్‌లో చూసిన భర్త శ్రీనివాస రెడ్డి

  • భర్త సరిగ్గా చూసుకోవడం లేడని 54 రోజులుగా సంగీత నిరసన దీక్ష
  • తల్లితో పాటే ఇంటి బయట కూర్చున్న ఆమె పాప
  • ఇంట్లోకి వెళ్లాలని కోర్టు ఆదేశాలు
హైదరాబాద్ శివారులోని బోడుప్పల్‌లో 54 రోజులుగా తన పాపను ఒడిలో పెట్టుకుని నిరసన దీక్ష చేస్తోన్న సంగీత ఎట్టకేలకు ఈ రోజు తన అత్తింట్లో తిరిగి అడుగుపెట్టింది. టీఆర్ఎస్ మాజీ నేత శ్రీనివాస్ రెడ్డి తన భార్య సంగీతను కొట్టిన దృశ్యాలు 54 రోజుల క్రితం మీడియాలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టు ఈ రోజు సంగీత కేసులో పలు ఆదేశాలు జారీ చేసింది. సంగీతను ఆమె భర్త శ్రీనివాస్‌ రెడ్డి గౌరవ ప్రదంగా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. అంతేకాకుండా ప్రతి నెల రూ.20వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే, శ్రీనివాస రెడ్డి మాత్రం కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తానని అంటున్నారు. కోర్టు తీర్పుతో ఈ రోజు పలువురు అధికారులు సంగీత ఇంటికెళ్లి ఆమెను ఇంట్లోకి పంపారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఆ తాళాలను సుత్తి సాయంతో సంగీత స్వయంగా పగులకొట్టింది. ఆ సమయంలో శ్రీనివాస రెడ్డి ఓ టీవీ చానెల్ లైవ్‌లో మాట్లాడుతూ ఈ దృశ్యాలను చూశారు.
srinivasa reddy
Hyderabad
sangitha

More Telugu News