విశ్వనాథ్ గారి సినిమా చేస్తాననుకోలేదు .. వాళ్లను చూడగానే కంగారేసింది: ఆమని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశ్వనాథ్ గారి సినిమా చేస్తాననుకోలేదు .. వాళ్లను చూడగానే కంగారేసింది: ఆమని

  • 'శుభ సంకల్పం' కోసం పిలిపించారు 
  • మేకప్ టెస్ట్ చేసి ఓకే అన్నారు
  • అప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు
"విశ్వనాథ్ గారి సినిమా 'శుభసంకల్పం'లో అవకాశం ఎలా వచ్చింది?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆమనికి ఎదురైంది. అప్పుడామె స్పందిస్తూ .." నా స్టిల్స్ చూసిన విశ్వనాథ్ గారు మేకప్ టెస్ట్ చేయాలన్నారు. నిర్మాత బాలసుబ్రమణ్యం గారు కావడంతో మేకప్ టెస్ట్ కి చెన్నైలోని ఆయన ఇంటికి రమ్మన్నారు. అక్కడికి వెళ్లే సరికి కమలహాసన్ గారు కూడా వున్నారు.

 వాళ్లందరిని చూసే సరికి భయంతో వణుకు వచ్చేసింది. నా మొదటి సినిమా అప్పుడు కూడా నేను అంతగా భయపడలేదు. ఆ సినిమాలో కనిపించే గెటప్ తో మేకప్ టెస్ట్ చేశారు .. అందరికీ నచ్చడంతో అడ్వాన్స్ ఇచ్చేశారు. విశ్వనాథ్ గారు .. కమల్ గారు చేసిన 'సాగరసంగమం' నేను చూశాను. అలాంటి కాంబినేషన్లో నాకు ఛాన్స్ రావడంతో అమృతం తాగినట్టుగా అనిపించింది" అన్నారు.     
amani
kamal

More Telugu News