ఆ ఆర్టిస్టులను చూస్తే నాకు జాలేస్తోంది: నటి సుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఆర్టిస్టులను చూస్తే నాకు జాలేస్తోంది: నటి సుధ

  • సీన్లో ఓ ప్రోపర్టీలా నేను నుంచోలేను 
  • అలా చేస్తున్న వాళ్లను చూసి బాధపడుతున్నా 
  • అలాంటి పాత్రలు చేయనని చెప్పేస్తా
క్యారక్టర్ ఆర్టిస్ట్ గా 'సుధ'కు మంచి పేరుంది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఆమె గుర్తుంచుకోదగిన పాత్రలను చేశారు. అలాంటి సుధ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "కొంతకాలంగా .. ఒకప్పుడు హీరోయిన్స్ గా వున్న వాళ్లు ఇప్పుడు మదర్ కేరక్టర్స్ వేస్తున్నారు. అందువలన మీకు రావలసిన అవకాశాలు తగ్గిపోయాయా? మంచి పాత్రలు రావడం లేదని మీరు తగ్గించుకున్నారా?" అనే ప్రశ్న సుధకు ఎదురైంది.

అందుకామె స్పందిస్తూ .. "నేను పోషించిన పాత్రల వంటివి నా కంటే ముందు జయసుధ గారు చేశారు. ఆ తరహా పాత్రలు చేయడం నాతోనే ఆగిపోయింది. నేను చేసిన పాత్రల వంటివి ఇప్పుడు ఎవరు చేస్తున్నారని? ప్రగతి .. పవిత్ర లోకేష్ .. తులసి .. నదియాగారు కానివ్వండి, వాళ్లని చూసి నేను బాధపడుతున్నాను. వీళ్లంతా కూడా సీన్ లో ఒక ప్రోపర్టీలా నుంచుంటున్నారు. అది వాళ్లకి ఇష్టమైందేమోగానీ .. నా వరకూ చెప్పాలంటే నేను చేయను" అని తేల్చి చెప్పారు.     
sudha

More Telugu News